మీడియా సంస్థలపై ధోని భార్య ఆగ్రహం

 మీడియా సంస్థలపై ధోని భార్య ఆగ్రహం

మహమ్మారి  కరోనా వైరస్(కోవిడ్‌-19) సంక్షోభంపై పోరులో ప్రభుత్వాలకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు పలువురు వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌ అసోం ప్రభుత్వానికి తన నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని తన వంతు సహాయంగా ఓ ఎన్జీవో ద్వారా లక్ష రూపాయలు సహాయ నిధికి అందించినట్లు వార్తలు వెలువడ్డాయి.

ఈ క్రమంలో ధోని తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంతో సంపన్నుడైన క్రికెటర్‌.. ఇంత పెద్ద మొత్తం దానం చేయడం గొప్ప విషయం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కరోనా సంక్షోభంలో డొనేషన్‌ జోక్‌గా మారిపోయిందంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై ధోని భార్య సాక్షి ధోని తీవ్రంగా స్పందించారు. ఈ వార్తను ప్రచురించిన మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు..‘‘సున్నితమైన సమయాల్లో ఇలాంటి నకిలీ వార్తలు ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలను అభ్యర్థిస్తున్నా! సిగ్గు పడండి! జర్నలిజం విలువలు మాయమైపోయాయా అని నాకు ఆశ్చర్యం కలుగుతోంది’’అని సాక్షి ట్వీట్‌ చేశారు.

Author News9

Related post