ప్రత్యేక అనుమతుల్ని దుర్వినియోగం చెయ్యదు డీజీపీ

 ప్రత్యేక అనుమతుల్ని దుర్వినియోగం చెయ్యదు డీజీపీ

నిత్యావసర, అత్యవసర విభాగంలోకి వచ్చే వాహనాల
రాకపోకలకు ఎలాంటి అవరోధం లేదని డీజీపీ మహేందర్
రెడ్డి తెలిపారు. వాహనదారులు తాము సరఫరా చేస్తున్న
వస్తువులకు సంబంధించిన చిత్రాలను వాహనం ముందు
ప్రదర్శించాలని, దీని వల్ల తనిఖీలో ఉన్న పోలీసులు సులభంగా
గుర్తించే వీలుంటుందని అన్నారు. వస్తువులను అన్లోడ్ చేసి
తిరిగి వెళ్లే వాహనాలను తనిఖీ బృందాలు అనుమతించాలని
పోలీసులను ఆదేశించారు.

అనుమతి ఉన్న ఆన్లైన్ డెలివరీ సిబ్బంది సైతం వారి సంస్థకు
సంబంధించిన టీషర్టులను వేసుకోవాలని మహేందర్ రెడ్డి
సూచించారు. గుర్తింపు కార్డులను చూపించాలని దీనివల్ల
తనిఖీల సందర్భంగా ఎలాంటి సమస్యలు తలెత్తవని తెలిపారు.
నిత్యా వసర, అత్యవసర విభాగంలోకి వచ్చే వ్యక్తులకు కల్పించిన
ప్రత్యేక అనుమతుల్ని దుర్వినియోగం చేయొద్దని అన్నారు.
విధులు ముగించుకున్న తర్వాత ఇంటికే పరిమితం కావాలని
డీజీపీ సూచించారు.

Author News9

Related post