శాసనసభ ఉద్యోగికి కరోనా వైరస్ .అధికారులందరికీ ముందుజాగ్రత్తగా పరీక్షలు

 శాసనసభ ఉద్యోగికి కరోనా వైరస్ .అధికారులందరికీ ముందుజాగ్రత్తగా పరీక్షలు

ఒడిశా రాష్ట్ర శాసనసభ ఉద్యోగికి కరోనా వైరస్ సోకడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒడిశా రాష్ట్ర అసెంబ్లీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకడంతో అతన్ని వెంటనే ఐసోలేషన్ గదికి తరలించారు. దీంతో ఒడిశా అసెంబ్లీలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులందరికీ ముందుజాగ్రత్తగా పరీక్షలు చేయించి వారిని క్వారంటైన్ చేశారు. ఈ నెల 30 వతేదీ నుంచి ఒడిశా అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ భవనాన్ని శానిటైజ్ చేయించి ఖాళీ చేయించారు. కరోనా రోగి అసెంబ్లీ భవనంలో తిరిగిన నేపథ్యంలో ఈ నెల 30వతేదీ నుంచి జరిగనున్న అసెంబ్లీ సమావేశాలను లోకసేవా భవన్ లో నిర్వహిస్తామని ఒడిశా అసెంబ్లీ స్పీకర్ ఎస్ఎన్ పాత్ర చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన శాసనసభ్యులు ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని స్పీకర్ పాత్ర కోరారు.

Author News9

Related post