కరోనా వైరస్ ప్రస్థుత స్థితి గురించి ప్రధాని మోదీ మన్ కీ బాత్

 కరోనా వైరస్ ప్రస్థుత స్థితి గురించి ప్రధాని మోదీ మన్ కీ బాత్

దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మొట్టమొదటిసారి ప్రధామంత్రి నరేంద్రమోదీ ఆదివారం దీనిపై మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు.ఆదివారం ఉదయం 11 గంటలకు తాను మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో కరోనా వైరస్ ప్రస్థుత స్థితి గురించి మాట్లాడుతానని మోదీ ట్వీట్ చేశారు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, నరేంద్రమోదీ మొబైల్ యాప్ లలో మోదీ మన్ కీ బాత్ వినవచ్చు. హిందీ భాషలో ప్రసంగించే మోదీ ఉపన్యాసాన్ని అనంతరం ఆకాశవాణి ప్రాంతీయ భాషల్లోనూ వినవచ్చు. మీ మొబైల్ ఫోన్ లో మన్ కీ బాత్ వినాలంటే 1922కు మిస్‌డ్ కాల్ చేస్తే చాలు. కొవిడ్ ను అదుపుచేసేందుకు ప్రధాని మోదీ 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు.

Author News9

Related post