సమాచారాన్ని దాచిన కారణంగా 13 మందికి వ్యాధి…కంపెనీపై కేసు నమోదు!

 సమాచారాన్ని దాచిన కారణంగా 13 మందికి వ్యాధి…కంపెనీపై కేసు నమోదు!

కరోనా వైరస్ దేశంలో వేగంగా వ్యాపిస్తోంది. లాక్ డౌన్ ఉన్నప్పటికీ, దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ అంటువ్యాధిని ఆపడానికి కేంద్ర, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వెంటనే దాన్ని ఆపడం సాధ్యం కావడంలేదు. ఇదిలావుండగా విదేశీ ప్రయాణానికి సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టిన నోయిడాలోని ఒక ప్రైవేట్ సంస్థపై కేసు నమోదైంది. ఆ సంస్థ సమాచారాన్ని దాచిన కారణంగా 13 మందికి వ్యాధి సోకింది. నోయిడా సిఎంఓ సీజ్ ఫైర్ కంపెనీపై కేసు నమోదైంది. సీజ్ ఫైర్ కంపెనీకి  విదేశాల నుండి చాలా మంది రావడం వల్ల నోయిడాలోని పలుప్రాంతాలకు కరోనా వైరస్ వ్యాపించిందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఈ  నేపథ్యంలో సదరు కంపెనీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Author News9

Related post