Headlines

రాబోయే ఎన్నికల్లో జనసేన(Janasena)తోనే బీజేపీ పొత్తు : విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్

రాబోయే ఎన్నికల్లో జనసేన(Janasena)తోనే బీజేపీ పొత్తు అని.. విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ అన్నారు. పవన్(Pawan)​తోనే ముందుకెళ్తామన్నారు. రాజమహేంద్రవరంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జు​ల సమావేశంలో మురళీధరన్​ పాల్గొన్నారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వడం లేదని మురళీ ధరన్ అన్నారు. ఈ కారణంగా ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘ఏపీ అభివృద్ధికి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూడు లక్షల కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనులు చేపట్టాం. మరో రూ.30 వేల కోట్ల ఇతర ప్రాజెక్టులు మంజూరు చేశాం.’ అని మురళీధరన్ న్నారు. ఏపీ రాజకీయాల్లో(AP Politics) సమీకరణాలు రోజురోజు మారుతున్నాయి. కొత్త కొత్త వ్యూహాలతో పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే ప్రధాని మోదీ(PM Modi) విశాఖ పర్యటన సందర్భంగా.. పవన్ కల్యాణ్(Pawan Kalyan)తో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. బీజేపీ-జనసేన పొత్తు కన్ఫామ్ అని చర్చ మెుదలైంది. అయితే మోదీతో సమావేశం తర్వాత.. మీడియా ముందుకు వచ్చిన పవన్..

అసలు విషయాలు మాత్రం చెప్పలేదు. 2014లో మోదీని కలిశానని… మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత కలిసినట్లు పవన్ తెలిపారు. చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ భేటీ కొనసాగిందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) బాగుండాలి.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షించారన్నారు. తెలుగు ప్రజల మధ్య ఐక్యత, ఏపీ ప్రజల బాగోగుల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఈ భేటీతో భవిష్యత్తులో ఏపీకి మంచి రోజులు వస్తాయని భావిస్తున్నట్లు పవన్ అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ(BJP) రాష్ట్రంలో అంత బలంగా లేకపోయినా.. పవన్ లాంటి నేతను కలుపుకొని వెళ్లి.. లబ్ధి పొందాలనుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి.. ఉపయోగపడుతుందనే ఇక్కడి పార్టీలు అనుకుంటున్నాయి. ఈ పొత్తులోకి చివరకు టీడీపీ కూడా చేరుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. మూడు పార్టీలు కలిసి వెళ్తే.. జగన్ ను ఎదుర్కొనేందుకు ఉపయోగం ఉంటుందని అభిప్రాయాలు వస్తున్నాయి. మరోవైపు బీజేపీ నేతలు(BJP Leaders) మాత్రం.. జనసేనతోనే తమ పొత్తు అని.., టీడీపీతో ఉండనది స్పష్టం చేస్తున్నారు.