టెలివిజన్‌ కార్మికులకు ఒక నెలకు సరిపడా ఆర్థికసాయం :ప్రదీప్

 టెలివిజన్‌ కార్మికులకు ఒక నెలకు సరిపడా ఆర్థికసాయం :ప్రదీప్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి వల్ల  దేశదేశాలే స్తంభించిపోయాయి. భారత్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీని ప్రభావం అన్ని రంగాలపై పడింది. వీటిలో సినీ, టెలివిజన్‌ రంగాలు కూడా ఉన్నాయి. లాక్‌డౌన్‌ వల్ల  సినిమా, టీవీ షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. షూటింగ్‌లు ఆగిపోవడం వల్ల రోజువారీ వేతనాలకు పనిచేసే కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సిసీ కార్మికులను ఆదుకునేందుకు కొంతమంది హీరోలు ముందుకొచ్చి రూ.కోట్లల్లో విరాళాలు ప్రకటిస్తున్నారు. అలాగే బుల్లితెరపై కూడా చాలా మంది కార్మికులు ఆధారపడి ఉంటారు. ఒక్కో షోకు వందలాది కార్మికులు కష్టపడుతుంటారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరందరికి పనిలేకుండా పోయింది. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ యాంకర్‌ ప్రదీప్. తనకు తెలిసిన 60 మంది టెలివిజన్‌ కార్మికులకు ఒక నెలకు సరిపడా ఆర్థికసాయం చేస్తాననని ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు.

Author News9

Related post