ఆసుపత్రులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్‌ ఆగకూడదు

 ఆసుపత్రులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్‌ ఆగకూడదు

ఆసుపత్రులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగరాదని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. వైరస్ బాధితులకు వైద్య సేవల్లో సమస్యలు తలెత్తకుండా విద్యుత్‌ సరఫరా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాజా పరిస్థితిపై విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు, జెన్‌కో ఎండీ శ్రీధర్, డిస్కమ్‌ల సీఎండీలు, పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఏ.చంద్రశేఖర్‌రెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

Author News9

Related post