రోజుకు లక్ష మందికి భోజనం..

 రోజుకు లక్ష మందికి భోజనం..
 రాష్ట్రంలో కరోనా రోగులకు సంబంధించి మంత్రి కేటీఆర్‌ ఓ శుభవార్త తెలిపారు. ఇటీవల కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలిన 11 మందికి, ఆదివారం నిర్వహించిన తాజా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినట్లు వెల్లడించారు. ఇది కొంతవరకు శుభవార్త అని ట్విటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరినీ పస్తులుంచబోమని, ఈ విషయం లో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పనిచేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న అన్నపూర్ణ కేంద్రాల ద్వారా 150 చోట్ల మధ్యాహ్నం, రాత్రి భోజనం ఉచితంగా అందిస్తున్నామని తెలిపా రు. శనివారం దాదాపు 40 వేల మందికి భోజనం అందించామని వెల్లడించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తున్న అక్షయపాత్ర సంస్థకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. రోజుకు కనీసం లక్ష మందికి భోజనం అందించేలా చూడాలని కోరారు. పారిశుధ్య కార్మికుల కోసం రూ.5లక్షలు విరాళం ఇచ్చిన నిరంజన్‌రావును అభినందించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 145 మొబైల్‌ రైతుబజార్లను ప్రారంభించామని తెలిపారు. చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆపకుండా చర్యలు తీసుకోవాలని ఒక నెటిజన్‌  కేటీఆర్‌ను కోరారు.

Author News9

Related post