ఆమె రెండు ప్రపంచ యుద్ధాలను జయించింది.

 ఆమె రెండు ప్రపంచ యుద్ధాలను జయించింది.

ఆమె రెండు ప్రపంచ యుద్ధాలను జయించింది. 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని వణికించిన ‘స్పానిష్‌ ఫ్లూ’ని తట్టుకుని నిలబడింది. కానీ ఇప్పుడు.. ప్రపంచానికే సవాల్‌ విసురుతున్న కరోనాతో పోరాడి.. ఓడి.. తనువుచాలించింది. బ్రిటన్‌లో కరోనా వైర్‌సకు బలైన అత్యంత వృద్ధురాలిగా నిలిచింది. 108 ఏళ్ల ఆ యోధురాలి పేరు హిల్డా చర్చిల్‌. మరో వారంలో తన 109వ పుట్టినరోజును జరుపుకొనేందుకు సిద్ధమవుతున్న వేళ.. కరోనా బారినపడి ఆదివారం కన్నుమూసింది. 1918లో ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందిని బలితీసుకున్న ‘స్పానిష్‌ ఫ్లూ’ మృత్యుఘోషనూ తట్టుకుని నిలబడ్డ ఆమె.. ప్రస్తుత కరోనా ధాటికి తలవాల్చింది.

Author News9

Related post