తేలిన విదేశాల నుంచి వచ్చిన వారి లెక్క

 తేలిన విదేశాల నుంచి వచ్చిన వారి లెక్క

విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే కొవీఢ్ -19 వ్యాప్తి చెందుతుంది. అందుకే అసలు జిల్లాకు ఎంతమంది వచ్చారనే లెక్క పక్కాగా తీశారు. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి జిల్లాకు 2,703 మంది వచ్చినట్లుగా ధ్రువీకరించారు. కేంద్ర విమానయాన శాఖ నుంచి వచ్చిన జాబితాలో ఉన్న అడ్రస్‌ల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేయగా ఇందులో 2,606 మందిని గుర్తించారు. 97 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వీరు ఎక్కడ ఉన్నారనేది దానిపై ఆరా తీస్తున్నారు. జాబితాలో ఇచ్చిన అడ్రస్‌లో వారు లేకపోవటంతోనే సమస్యగా మారింది. ఇదే విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. విదేశాల నుంచి వచ్చిన వారి జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆచూకీ లభించకపోవటంపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎందుకిలా జరిగిందనేది నిశిత పరిశీలన చేయాలని పోలీసు, రెవెన్యూ, వైద్య శాఖలకు ఆదేశించింది. మరో పక్క సచివాలయ, వార్డు/గ్రామ వలంటీర్లు సైతం ఇదే పనిలో ఉన్నారు. 

Author News9

Related post