రోగులను పర్యవేక్షించేందుకు మొబైల్ యాప్‌

 రోగులను పర్యవేక్షించేందుకు మొబైల్ యాప్‌

కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత ఆపత్కాలంలో హోం క్వారంటైన్‌లో ఉన్న రోగులను పర్యవేక్షించేందుకు మొబైల్ యాప్‌ను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది.హిమాచల్‌ప్రదేశ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ రూపొందించిన ‘కరోనా ముక్త్ హిమాచల్’ మొబైల్ యాప్ ద్వారా వైద్యఆరోగ్యశాఖ కార్యకర్తలు హోం క్వారంటైన్ లో ఉన్న వారి కదలికలను పర్యవేక్షిస్తారు. ఓటీపీ బేస్‌డ్ అప్లికేషన్ సాయంతో పనిచేసే ఈ మొబైల్ యాప్ ద్వార హోంక్వారంటైన్ లో ఉన్న వారు నిబంధనలను ఉల్లంఘిస్తే ఆరోగ్యకార్యకర్తలు సులభంగా గుర్తిస్తారని హిమాచల్‌ప్రదేశ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ డైరెక్టర్ రోహాన్ చాంద్ ఠాకూర్ చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 1779 మంది హోంక్వారంటైన్ లో ఉన్నారు. వారి కదలికలను గుర్తించేందుకు సర్కారు కరోనా ముక్త్ యాప్ రూపొందించింది.

Author News9

Related post