జమాత్‌కు వెళ్లిన వారిపై దృష్టి

 జమాత్‌కు వెళ్లిన వారిపై దృష్టి

డిల్లీ జమాత్‌కు వెళ్లి వచ్చిన జిల్లావాసులను గుర్తించే ప్రక్రియ మొదలైంది.  ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. జిల్లా అధికారులు యుద్ధ ప్రాతిపదికపై జిల్లాను జల్లెడ పట్టారు.  జిల్లా నుంచి 59మంది వెళ్లినట్లు భావిస్తున్నారు.  వివిధ ప్రాంతాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు. మంగళవారం ఢిల్లీ జమాత్‌ అంశం చర్చనీయాంశమైంది. 25 మంది ప్రొద్దుటూరు వాసులను గుర్తించారు. ఈ మేరకు వారిని జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. వారితో పాటు విశాఖపట్నం, అజ్మీర్‌కు వెళ్లి వచ్చిన  మరో ముగ్గురిని కూడా క్వారంటైన్‌ సెంటర్‌కు పంపించారు. రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. చాపాడు ఎస్‌ఐ మహ్మద్‌రఫి మంగళవారం ఆస్పత్రికి చేరుకొని క్వారంటైన్‌లో ఉన్న వారితో మాట్లాడారు. వారికి సమకూర్చాల్సిన ఆహారం, ఇతరత్రా సౌకర్యాల గురించి ఎస్‌ఐ అడిగి తెలుసుకున్నారు.  భయపడాల్సిన అవసరం లేదని, అన్ని సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్థానిక వైద్యులతో పాటు డీఎస్పీ సుధాకర్, సీఐలు విశ్వనాథ్‌రెడ్డి, నరసింహారెడ్డి, నాగరాజు, ఎస్‌ఐలు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

Author News9

Related post