టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సిబిఐకు మరోమారు లేఖ

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సిబిఐకు మరోమారు లేఖను రాశారు. ఆ నెల ఆరున విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ రోజు తాను విచారణకు హాజరు కాలేనంటూ సిబిఐకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సిబిఐ నోటీసుల తర్వాత తన తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన కవిత అదే రోజు సిబిఐకు లేఖ రాశారు. తాజాగా మరోసారి సిబిఐకు లేఖ రాసిన కవిత విచారణ తేదీలను మార్చాలని సిబిఐను కోరారు. సిబిఐకు లేఖ రాసిన తర్వాత ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయిన కవిత అదే రోజు ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వాలని కోరారు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని అందచేయాలని సిబిఐకు లేఖరాశారు.దీంతో సిబిఐ వెబ్‌సైట్‌లో ఎఫ్‌ఐఆర్‌ అందుబాటులో ఉందని కవితకు సమాచారం ఇచ్చారు. ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలించిన తర్వాత అందులో తన పేరు లేకపోవడాన్ని గుర్తించినట్లు కవిత పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో నవంబర్ 30న సిబిఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరును కూడా నిందితురాలిగా పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ నెల 2న కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది.

సిఆర్‌పిసి 160 ప్రకారం నోటీసులు జారీ చేసిన సిబిఐ డిసెంబర్ 6న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తన నివాసంలో విచారణకు హాజరవుతానని కవిత ప్రత్యుత్తరం కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఈ నెల 3న ప్రగతి భవన్‌లో సిఎంతో భేటీ తర్వాత ఎఫ్‌ఐఆర్‌ కాపీ కావాలని కవిత కోరారు. తాజాగా సోమవారం సిబిఐకు కవిత మరో లేఖను రాశారు. డిసెంబర్ ఆరో తేదీనతాను అందుబాటులో ఉండట్లేదని కవిత సోమవారం రాసిన లేఖలో తెలియజేశారు. మద్యం కుంభకోణానికి సంబంధించి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత సోమవారం సీబీఐకి రాసిన లేఖలో ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు ఏ విధంగానూ లేదని పేర్కొన్నారు. డిసెంబర్ 6న తాను అందుబాటులో ఉండబోనని దర్యాప్తు సంస్థకు సమాచారం అందించారు. సిబిఐఅధికారులతో కవిత సమావేశానికి మరో నాలుగు తేదీలను ప్రతిపాదించారు. “నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని విచారణకు సహకరిస్తానని చెప్పారు. విచారణకు సహకరించడానికి పైన అనువుగా ఉన్న తేదీలలో విచారణ బృందాన్ని కలుస్తానన్నారు. చట్టం ప్రకారం లభించే తన హక్కులకు ఎటువంటి భంగం కలిగించరాదని భరోసా కల్పించాలని, డిసెంబరు 11, 12, 14, 15 తేదీలలో విచారణకు హాజరయ్యేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రత్యామ్నాయ తేదీలను ఇస్తూ రాసింది