పురుగులను చంపేయాలా.. పెంచి గూళ్లు కట్టించాలో అర్థంకాని పరిస్థితి

 పురుగులను చంపేయాలా.. పెంచి గూళ్లు కట్టించాలో అర్థంకాని పరిస్థితి

పట్టు రైతులకు కరోనా కాటు పడింది. కరోనా వైరస్‌ దాటికి పట్టుగూళ్ల కొనుగోలు కేంద్రాలు మూతపడటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పట్టు పురుగులను పెంచుతున్న రైతులు పురుగులను మేపాలా, వద్దా అనేది అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. ఎకరం పొలంలో మల్బరీ ఆకు పెంచేందుకు, పట్టు గుడ్లు కొనుగోలు, చాకీ ఖర్చులు, గూళ్ల దిగుబడికి రూ.ఎకరానికి రూ. 30 వేల వరకు పెట్టుబడి అవుతుంది. ఇప్పటికే కొందరు రైతులు పంట పూర్తికాగా, మరి కొందరు రైతులు పట్టు గూళ్లు తీయాల్సి ఉంది. కొందరు రైతులు పురుగులు నాలుగో దశలో ఉన్నాయి. పంట పూర్తయి పట్టుగూళ్లు తీసిన రైతులు వాటిని విక్రయించుకునేందుకు మార్కెట్‌ సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పంట చివరి దశలో ఉన్న రైతులు గూళ్లు కట్టించాలా.. ముందే పంటను పడేయాలా అనే సందేహంలో ఉన్నారు. కిలో పట్టుగూళ్లు రూ.700 నుంచి రూ.750 వరకు ధర పలుకుతున్న తరుణంలో మార్కెట్‌లు మూతవేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Related post