ఎపిలో ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలను చివరి నిమిషంలో వాయిదా వేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులపై ప్రభుత్వం స్పందించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రేపు హైకోర్టులో అప్పీలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల పోలింగ్‌కు సమయం తక్కువగా ఉన్నందున అత్యవసరంగా ఈ పిటిషన్‌ను విచారణకు చేపట్టాలని కోరనుంది. ఎపిలో ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలపై స్టే విధిస్తూ ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. రాష్ట్రంలో […]Read More
మన తెలుగు వ్యక్తి దేశ అత్యున్నత స్థానం దక్కబోతోంది. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్ 24న […]Read More
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం పతాక స్ధాయికి చేరింది. వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పక్షాలతో పాటు వామపక్షాల అభ్యర్ధి ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈనెల 17వ తేదీన ఎన్నికలు ఉండటంతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారాన్ని ఇంటింటికీ చేయటం ప్రారంభించారు. అధికార, ప్రతిపక్షాల నేతలు తిరుపతిలోనే మకాం వేసి ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. వైసీపీకి అండగా ఉన్న ఓటు బ్యాంక్‌లో ఉన్న అసంతృప్తిని తమ వైపుకు తిప్పుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. సంస్ధాగత బలంలేని బీజేపీ, జనసేనాని […]Read More
ఏపీలో పనిచేస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఉగాది పండుగ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు నగదు పురస్కారంతో సత్కరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పేరిట మూడు కేటగిరీల్లో ఈ అవార్డులు అందజేయనుంది. సేవావజ్రకు రూ. 30 వేలు, సేవారత్నకు రూ. 20 వేలు, సేవామిత్రకు రూ. 10 వేలు నగదు పురస్కారం, శాలువాతో సత్కరించనుంది. అయితే ఇందుకోసం కొన్ని […]Read More
వివేకానంద రెడ్డి హత్య కేసులో పవన్ చేసిన వ్యాఖ్యలను• మంత్రి కొడాలి నాని ఖండించారు. తన తండ్రి హత్య కేసు విచారణ వేగవంతం చేయాలని వివేకా కుమార్తె ఢిల్లీలో సీబీఐని ప్రశ్నిస్తే తాము విచారణ చేయట్లేదని రాష్ట్రంలో మాట్లాడడం పవన్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం చేసే విచారణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన పవన్ తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమేంటని నాని ప్రశ్నించారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన […]Read More
పరిషత్ ఎన్నికలపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఎస్ఈసీ తరపున సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. జనసేన పిటిషన్‌పై కూడా హైకోర్టు వాదనలు విన్నది. కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీకి కోర్టు ఆదేశించింది. ఎస్ఈసీ ఒకసారి ఉత్తర్వులు ఇచ్చాక అందులో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేదని సీవీ మోహన్‌రెడ్డి వాదించారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు పోటీ చేసే అవకాశం కోల్పోయారని, పిటిషనర్లు ఆధారాలు చూపలేదని […]Read More
గతంలో జయలలిత, జ్యోతిబసు వంటి వారు ఎన్నికల్ని బహిష్కరించారని టీడీపీ నేత చినరాజప్ప అన్నారు. వాళ్లు కార్యకర్తల్ని కాపాడుకొని సీఎంలు అయ్యారని ఏ2 విజయసాయిరెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. మీ ఏ1 కూడా అసెంబ్లీని రెండేళ్లు బహిష్కరించిన విషయం మరిచారా?, విజయసాయికి దొంగ లెక్కలు తప్ప చరిత్ర జ్ఞానం ఎక్కడుంది? అని ఆయన ప్రశ్నించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి ప్రజాస్వామ్య విలువలు ఏం తెలుసన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో దొంగ, పోలీసు ఒక్కటయ్యారని విమర్శించారు.Read More
టీడీపీకి చెందిన కృష్ణా జిల్లా నందిగామ జడ్పీటీసీ అభ్యర్థి సోషల్ మీడియాలో వినూత్న ప్రచారం సాగిస్తున్నారు. నందిగామ టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి సజ్జా అజయ్.. వైసీపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు. తాను ఆంధ్ర రాష్ట్రం కోసం, రాజధాని కోసం 14 రోజులు జైలుకు వెళ్లానన్నారు. రైతులు పడుతున్న కష్టాలపై పోరాడితే అక్రమ కేసులు పెట్టారన్నారు. తన అవసరాల కోసం కండువాలు మార్చే వ్యక్తికి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తాను కావాలో, […]Read More
పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది.. ఏపీకి మాత్రం ముగిసిన అధ్యాయం అంటూ కబుర్లు చెబుతోంది అంటూ ఘాటుగా విమర్శించారు ఏపీ మంత్రి పేర్ని నాని. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. బీజేపీ పచ్చి మోసకారి అని చెప్పిన ఆయన, పుదుచ్చేరికి హోదా ఇస్తామని నిర్మలాసీతారామన్ ప్రకటించింది.. ఏపీకి ఇవ్వలేని హోదా పుదుచ్చేరికి ఎలా ఇస్తారో బీజేపీ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. […]Read More
ఏపీలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. రాష్ట్ర పరిషత్ ఎన్నికలపై చంద్రబాబు నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. అయితే తమ అభిప్రాయాలను తెలిపిన టీడీపీ నేతలు.. ఎన్నికలను బహిష్కరించాలని పార్టీ నేతలు సూచించారు. అభ్యర్థులు కూడా పోటీ నుంచి వెనక్కి వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల బహిష్కరణపై క్యాడర్‌కు, అభ్యర్థులకు వివరించాలని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఎన్నికల బహిష్కరణపై పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటన చేయనుంది. అయితే కాగా, ఏపీ రాష్ట్ర ఎన్నికల […]Read More









