తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కొవిడ్ సోకినట్లు సీఎస్ స్వయంగా వెల్లడించారు. అయితే ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం అందలేదు. మంగళవారం ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిన్న సీఎం కేసీఆర్‌తో సోమేష్‌కుమార్ సమావేశమయ్యారు. ఇటీవల ఆయన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ కూడా తీసుకున్నారు. అయితే.. తెలంగాణలో కరోనా టెన్షన్ పెడుతోంది. రోజు రోజుకూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీంతో […]Read More
త్వరలోనే యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం ప్రారంభోత్సవం.సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణకే తలమానికంగా నిర్మితమవుతున్న యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పనులను సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నట్లు తెలిసింది. వచ్చే నెల 14వ తేదీన అక్షయ తృతీయ సందర్భాన్ని పురస్కరించుకుని హోమాలు, యాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడంపై వేద పండితులతో సమాలోచనలు జరుపుతున్నట్లు వినికిడి. మంచి ముహూర్త బలం ఉన్న అక్షయ తృతీయ రోజున సుదర్శన హోమంతో మొదలయ్యే ప్రత్యేక పూజలు వరుసగా ఎనిమిది రోజుల పాటు నిర్వహించి తొమ్మిదో రోజున ఉత్సవ […]Read More
రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో వర్ష సూచనలు ఉన్నట్లు హైదారాబాద్ వాతావారణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలోని తూర్పు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. నిన్నటి ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో స్థిరంగా […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని రజక, నాయీ బ్రహ్మణులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ రెండు వర్గాల కార్మికులు చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తున్న ఉచిత కరెంట్ సరఫరాను ప్రభుత్వం అంగీకరించింది. బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించారు. రాష్ట్రంలోని సెలూన్లు, లాండ్రీల, దోభీఘాట్లకు ఉచిత విద్యుత్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు తక్షణమే జీవో జారీ చేయాలని సీఎంవో కార్యదర్శిని […]Read More
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశవర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. శనివారం తాండూరులో వివిధ పార్టీల నేతలతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార బలంతో ఉన్న తెలంగాణ పార్టీని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో మరో కొత్త పార్టీ అవసరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార బలంతో ఉన్న టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు కొత్తగా మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు విషయమై రాష్ట్రంలో వివిధ పార్టీల […]Read More
యాదాద్రి క్షేత్రంలో ఆలయ సిబ్బందికి కరోనా రావడంతో వారం రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. కరోనా బాధితుల సంఖ్య పెరగడంతో దీంతో దేవస్థాన అధికారులు హోటల్‌ను కూడా మూసివేసిన విషయం తెలిసిందే. అయితే నేటి నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఆర్జిత సేవలు ప్రారంభం అయ్యాయి. ఈవో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్జిత సేవల్లో పాల్గొనేలా, కల్యాణ మండపం హల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు.Read More
తెలంగాణ భవన్లో కరోనా కలకలం రేగింది. ప్రధాన ద్వారం వద్ద నిత్యం విధుల్లో ఉండే బంజారాహిల్స్ ఏఎస్ఐ వసంత్ నాయక్ శుక్రవారం కరోనా బారినపడ్డారు. దీంతో ఇక్కడి సెక్యూరిటీతో పాటు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తీవ్ర జ్వరం, తుమ్ములతో అవస్థ పడుతున్న వసంత్ నాయక్ శుక్రవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయం తెలిసిన తెలంగాణ భవన్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.Read More
హైదరబాద్ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సునీల్ నాయక్ ఆత్మహత్యకు నిరసనగా బీజేవైఎం ఆందోళనకు దిగింది. బారికేడ్లను తోసుకుని కార్యకర్తలు గేట్ ఎక్కే ప్రయత్నం చేశారు. సునీల్‌నాయక్ కుటుంబానికి కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నినాదాలు చేశారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించే వరకు ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. సునీల్ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని బీజేవైఎం నేతలు ఆరోపించారు.Read More
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్రంలో రోజువారి కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. కొన్ని నెలల గ్యాప్ తరువాత మళ్లీ ఇంతటి స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,078 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో అంటే శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కరోనా […]Read More
నిజాంపేట్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడిస్తున్న రెండు ప్రైవేటు ఆస్పత్రులను జిల్లా వైద్యాధికారులు గురువారం సీజ్ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె.మల్లికార్జున్‌రావు ఆధ్వర్యంలో రేష్మా క్లినిక్, నిజాం ఆస్పత్రిని మూసివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని, అర్హతలేని వైద్యులతో చికిత్సలు చేయిస్తున్నారని, ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మరికొన్ని ఆస్పత్రులు, క్లినిక్‌లు, డెంటల్ ఆస్పత్రులు, ఫిజియోథెరపి క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని, […]Read More









