తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. “ప్రపంచ స్ధాయి విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ కేంద్రంగా నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీ, గోవా, త్రిపురలలో క్యాంపస్‌లు స్ధాపించిందని సిఎం గుర్తు చేశారు. జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీ బిహేవియరల్ సైన్స్ మరియు…