‘కస్టడీ’.. క్యూరియాసిటీ పెంచుతున్న చైతూ
సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఆకట్టుకుంటున్న హీరో నాగచైతన్య. ఆయన ఇటీవల చేసిన సినిమాలు లాల్ సింగ్ చద్దా, థ్యాంక్యూ నిరాశ పర్చినప్పటికీ, ఓ నటుడిగా మంచి మార్కులు పడ్డాయి. తాజాగా నాగచైతన్య – వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. కృతిశెట్టి కథానాయిక. ఈరోజు నాగచైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దాంతో పాటు టైటిల్ కూడా ప్రకటించేశారు. ఈ సినిమాకి `కస్టడీ` అనే పేరు ఖరారు…