: ‘ ఉప్పెన ‘ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టిన కృతి శెట్టి తన అందంతో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఆమెకు వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి.
కానీ ఆ సినిమాలు ఆమెకు అంతగా సక్సెస్ ను ఇవ్వలేదు. సుధీర్ బాబు తో కలిసి నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నితిన్ తో కలిసి నటించిన మాచర్ల నియోజకవర్గం, రామ్ తో కలిసి నటించిన వారియర్ , నాగ చైతన్య తో కలిసి నటించిన కస్టడీ సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో సోషల్ మీడియాలో కృతి శెట్టీని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.
Krithi Shetty opens up about her life partner
అయినా కృతి మాత్రం ఏ మాత్రం భయపడకుండా అభిమానులు తనని ఎలా ఇష్టపడతారో ఎలాంటి పనులు చేస్తే నచ్చుతారో అనే విధంగా ముందుకు వెళుతుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనకు కాబోయే భర్త గురించి రివీల్ చేసింది. తనకు కాబోయే భర్తకు పెద్దగా ఆస్తి ఉండక్కర్లేదట. అందంగా ఉండక్కర్లేదట కానీ బొద్దుగా ఉంటే ఇష్టమట. చబ్బీ చబ్బీ గా బుగ్గలు పెద్ద పెద్దగా ఉంటే చాలా ఇష్టమట. మంచి మనసు ఉండాలి అని, ఫైనాన్షియల్ స్టేటస్ బాగోలేక పోయిన మంచి మనసు ఉంటే చాలు అని అంటుంది. దీంతో సోషల్ మీడియాలో కృతి శెట్టి పేరు వైరల్ గా మారింది.
Krithi Shetty Bebamma Latest Photoshoot
ఇటీవలే కృతి శెట్టి నాగ చైతన్య తో కలిసి ‘ కస్టడీ ‘ సినిమాలో నటించింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికి కృతి శెట్టికి అంతగా గుర్తింపు రాలేదు. దీంతో సోషల్ మీడియాలో అమ్మడిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కృతి శెట్టికి నెక్స్ట్ సినిమా అయినా హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ప్రసుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంతా గ్లామర్ పరంగా సత్తా చాటుతున్నారు. మరీ యంగ్ హీరోయిన్ అయిన కృతి శెట్టి గ్లామర్ డోస్ పెంచాల్సి ఉంటుందని అంటున్నారు.