గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ కి పెళ్లి ఫిక్స్ అయిందని, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని వార్తలు వస్తున్నాయి.
వరుణ్, లావణ్య చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని, తాజాగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని తెలుస్తుంది. లావణ్య తన బర్త్ డే సందర్భంగా బెంగళూరు లో తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంది. ఆ పార్టీలో వరుణ్ కూడా పాల్గొన్నాడట. ఆమెకు డైమండ్ రింగ్ ఇచ్చి మరీ మ్యారేజ్ ప్రపోజల్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఆయన ప్రపోజల్ ని ఆమె వెంటనే యాక్సెప్ట్ చేశారట. అంతేకాదు ఇరు కుటుంబాలు కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నాయని టాక్. ఈ రేంజ్ లో వార్తలు వస్తున్నా ఇంతవరకు మెగా ఫ్యామిలీ స్పందించలేదు. తాజాగా ఈ వార్తలపై మెగా డాటర్ నిహారిక స్పందించింది. ఇక మనకు తెలిసిందే నిహారిక డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సెరీస్ లో నటించింది. ఇది త్వరలోనే విడుదల కాబోతుంది. ప్రస్తుతం నిహారిక దాని ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న నిహారిక కు ఎక్కువగా వెబ్ సిరిస్ కంటే వరుణ్ పెళ్లి గురించి ఎక్కువ ప్రశ్నలు ఎదురయ్యాయి.
niharika konidela life story
అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు నిహారిక అసహనం వ్యక్తం చేసింది. ఆ విషయం గురించి మాట్లాడానికి కూడా ఆమె ఇష్టపడలేదట. తాను కేవలం తన వెబ్ సిరీస్ గురించి మాట్లాడటానికి వచ్చానని చెప్పింది. ఇక లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ లు గతంలో మిస్టర్,అంతరిక్షం సినిమాలో కలిసి నటించారు. వీరిద్దరి మధ్య అంతరిక్షం సినిమా టైంలో ప్రేమ మొదలైందని సమాచారం. ఇక వరుణ్ చివరిగా ‘ ఎఫ్ 3 ‘ సినిమాలో నటించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. లావణ్య ఇటీవల పులి మేక వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది.