సినిమాని ఆపేయ్ .. త్రివిక్రమ్ కి మహేష్ స్ట్రాంగ్ వార్నింగ్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.

గతంలో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కయి. ఈ రెండు సినిమాలలో మహేష్ నీ త్రివిక్రమ్ చాలా వైవిధ్యంగా చూపించారు. ఈ మూడో సినిమాలో మహేష్ ని ఎలా చూపిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమా గత ఏడాది ఫిబ్రవరి నెలలో స్టార్ట్ అయింది. ఆ సమయంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 28వ తారీకు విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.

రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యాక మహేష్ తల్లి ఇందిరా… తర్వాత తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో… షూటింగ్స్ వాయిదా పడుతూ వచ్చాయి. అనంతరం సంక్రాంతి పండుగ తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే సినిమా షూటింగ్ ఉన్న కొద్దిగా ఆలస్యం అవుతూ ఉండటంతో మహేష్ తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ కి వార్నింగ్ ఇచ్చినట్లు.. టైం డెడ్ లైన్ పెట్టినట్లు టాక్. మేటర్ లోకి వెళ్తే 90 రోజుల్లో నాన్ స్టాప్ షెడ్యూల్ లో సినిమా మొత్తం కంప్లీట్ చేయాలని.. లేకపోతే సినిమా ఆపేయాలని కండిషన్ పెట్టినట్లు సమాచారం.

Mahesh Babu Fair on trivikram srinivas
దీంతో త్రివిక్రమ్ మిగతా నటీనటుల డేట్స్ ఈ 90 డేస్ లాంగ్ షెడ్యూల్ కోసం సెట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. మే 31వ తారీకు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా.. ఈ సినిమా టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది. “SSMB28” అనే వర్కింగ్ టైటిల్ పేరిట షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మహేష్ కి జోడీగా శ్రీ లీల… పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటిస్తున్నారు.