Headlines

అనుష్క ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్ అయ్యే న్యూస్‌

సుధీర్గకాలం నుంచి సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న అందాల భామల్లో అనుష్క శెట్టి ఒకరు. అయితే తాజాగా అనుష్క ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్ అయ్యే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

అదేంటంటే.. అనుష్క శాశ్వతంగా సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందట. ఆమె ఆఖరి చిత్రం `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`నే అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

 

2005లో `సూపర్‌` మూవీతో అనుష్క సినీ ప్రయాణం మొదలైంది. తక్కువ సమయంలో ఈ ముద్దుగుమ్మ స్టార్డమ్ ను సొంతం చేసుకుంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ అనేక చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోలకు జోడీగానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సూపర్ సక్సెస్ అయింది. అయితే సైజు జీరో మూవీ కారణంగా ఆమె బాగా బరువు పెరిగింది. అలా పెరిగిన బరువును ఆమె ఇప్పటికీ తగ్గించుకోలేకపోతోంది. ఓవర్ వెయిట్ ఉండటం వల్ల అనుష్క చాలా సినిమాలను వదులేసుకుంది.

 

లాంగ్ గ్యాప్ తర్వాత `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`కి అంగీకరించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకు పి. మహేష్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు. ఆగస్టు 4న ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఈ సినిమా తర్వాత అనుష్క పూర్తిగా సినిమాలకు దూరం కాబోతోందని అంటున్నారు. ఇందుకు తన బరువు ఒక కారణమైతే.. ఇంట్లో పెళ్లిపై చేస్తున్న ఒత్తిడి మరొక కారణమని అటున్నారు. అందుకే ఇక సినిమాలను వదిలేసి పెళ్లి చేసుకోవాలని అనుష్క డిసైడ్ అయిందట. ఇదే నిజమైతే ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు పడినట్లే అవుతుంది.