జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 (NFSA) కింద లబ్ధిదారుల కవరేజీ గురించి పార్లమెంటులో ప్రశ్నించిన అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ

జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 (NFSA) కింద లబ్ధిదారుల కవరేజీ గురించి పార్లమెంటులో ప్రశ్నించిన అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు

గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు లోక్ సభలో జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 (NFSA) కింద లబ్ధిదారుల కవరేజీలో ప్రజాపంపిణీ వ్యవస్థలోని అసమానతలను పరిష్కరించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి ప్రశ్నించారు. అదే విధంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పేదరిక స్థాయిలను నిర్ధారించడానికి కేంద్రం చేపట్టిన అధ్యయనాల గురించి సమాచారంతో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో లోని కవరేజీకి సంబంధించి ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా అని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరారు

ఇందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వర్యులు సాధ్వి నిరంజన్ జ్యోతి గారు సమాధానమిస్తూ, జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 గ్రామీణ జనాభాలో 75% వరకు మరియు పట్టణ జనాభాలో 50% వరకు కవరేజీని అందిస్తోందని చెప్పారు.

ఈ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం, ప్రతి రాష్ట్రానికి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో పబ్లిక్ డిస్ట్రిల్ సిస్టమ్ కింద ఉన్న శాతం కవరేజీని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని, మరియు రాష్ట్రంలో కవర్ చేయాల్సిన మొత్తం వ్యక్తుల సంఖ్య సంబంధిత గణాంకాలు, ప్రచురించబడిన జనాభా లెక్కల ఆధారంగా లెక్కించబడుతాయని సాధ్వి నిరంజన్ జ్యోతి గారు పేర్కొన్నారు

2011 జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలోని 81.35 కోట్ల జనాభాలో, 80.11 కోట్ల మంది లబ్ధిదారులను ఈ చట్టం పరిధిలో గుర్తించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మరో 1.24 కోట్ల అదనపు లబ్ధిదారులను గుర్తించే అవకాశం ఉందిని కేంద్ర మంత్రి గారు తెలిపారు.

లబ్ధిదారుల కవరేజీని 2011 -12 లో అప్పటి అధ్యయనాల ఆధారంగా ప్రణాళికా సంఘం (నేటి నీతి ఆయోగ్) నిర్ణయించిందని, ప్రస్తుతం,ఈ చట్టం కింద కవరేజీలో సవరణ ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలనలో లేదని, ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే కవరేజీ కొనసాగనుందని కేంద్ర మంత్రి గారు తెలియజేశారు