Headlines

గుజరాత్‌లో బీజేపీ ఘన విజయం విజయం.. మోడీ రికార్డు బద్ధలు

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం మొదలైంది. ఈ ఓట్ల లెక్కింపులో గుజరాత్‌లో బీజేపీ, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలు విజయం దిశగా దూసుకెళుతున్నాయి. ముఖ్యంగా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విజయం ఇటు కాంగ్రెస్, అటు బీజేపీల మధ్య దోబూచులాడాయి. చివరకు కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు చేరువైంది. ఆ పార్టీ సరిగ్గా 35 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 29, కాంగ్రెస్ 35, ఇతరులు నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

అంటే, హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఒకసారి అధికారంలో ఉన్న పార్టీని మళ్లీ గెలిపించిన దాఖలాలు లేవు. ఈ ఆనవాయితీని మరోమారు పునరావృతం చేశారు. దీంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. మరోవైపు, గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ తన హవాను కొనసాగిస్తుంది. ఆ పార్టీ ఏకంగా 155 సీట్ల ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా దిగజారింది. గతంతో పోల్చితే ఈ దఫా 60కు పైగా సీట్లను కోల్పోయింది. ప్రస్తుతం బీజేపీ 155 చోట్ల, కాంగ్రెస్ 18 చోట్ల, ఆప్ 6, ఇతరులు మూడు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.