Headlines

పరీక్ష కేంద్రాలు పరిశీలించిన సీఐ రజిని కుమార్*

కొత్తపేట మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను రావులపాలెం సిఐ రజిని కుమార్ పరిశీలించారు. విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారనేది అబ్జర్వ్ చేశారు. పరీక్ష రాసే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానిక పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై మణికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.