Headlines

హైకోర్టు (Telangana High Court) లో బిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (BRS Minister Srinivas Goud) కు గట్టి ఎదురుదెబ్బ

హైకోర్టు (Telangana High Court) లో బిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (BRS Minister Srinivas Goud) కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ (Petition)ను కొట్టివేయాలంటూ శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు.

అయితే మంత్రి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారని శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే, మంత్రి గా కొనసాగే అర్హత లేదని పిటిషన్ దాఖలు చేసారు. పిటిషన్ కు అర్హత లేదని పిటిషన్ కు కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ పై గతంలోనే వాదనలు పూర్తయ్యాయి. తాజాగా శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. రాఘవేంద్ర రాజు వేసిన పిటిషన్ ను అనుమతించింది హైకోర్టు.

2018 ముందస్తు ఎన్నికల సమయంలో మహబూబ్ నగర్ (Mahabubnagar) నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ ఆ సమయంలో నామినేషన్ తో పాటు, అఫిడవిట్ దాఖలు చేశారు. దానిని ఎన్నికల సంఘం సదరు వెబ్ సైట్ లోనూ పొందుపరిచారు. మొదటి దశలో జరిగిన ఎన్నికలు కావడంతో దాదాపు రెండు నెలల తర్వాత కౌంటింగ్ నిర్వహించారు. అయితే కౌంటింగ్ కు రెండు రోజులు ముందు వెబ్ సైట్ లో శ్రీనివాస్ గౌడ్ కు చెందిన కొత్త ఆఫిడవిట్ కనిపించింది. పాత అఫిడవిట్ ను తొలగించి, కొత్తది వెబ్ సైట్ లో పొందుపరచడం తో వివాదం మొదలైంది.

ఒకసారి నామినేషన్ ఆమోదం పొందిన తర్వాత అఫిడవిట్ ను తొలగించడం సాధ్యం అయ్యేపని కాదు. దీనికి ఎన్నికల సంఘం అధికారులు తగిన విధంగా సహకరిస్తే తప్ప ఈ వ్యవహారంపై కొంతమంది కేంద్ర ఎన్నికల సంఘానికి రాఘవేందర్ రాజు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరుపుతోంది.