Headlines

శాసన సభ ఎన్నికలకు సంబంధించి పోలీస్ బందోబస్తు ప్రక్రియ గురించి జిల్లా ఎస్పీ శ్రీ.చల్లా ప్రవీణ్ కుమార్ ఐపిఎస్., గారు తెలిపారు..

పత్రికా ప్రకటన

నిర్మల్ జిల్లా,నవంబర్,21.

 

శాసన సభ ఎన్నికలకు సంబంధించి పోలీస్ బందోబస్తు ప్రక్రియ గురించి జిల్లా ఎస్పీ శ్రీ.చల్లా ప్రవీణ్ కుమార్ ఐపిఎస్., గారు తెలిపారు.

 

మంగళవారం సాధారణ పరిశీలకులు శ్రీ.రవి రంజన్ కుమార్ విక్రమ్ IAS, పోలీస్ పరిశీలకులు శ్రీ. లక్ష్మన్ నింబర్గి IPS., గార్ల సమక్షంలో జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లు గురిచి నిర్వహించడం జరిగింది. ముందుగా ఎన్నికల ఏర్పాట్ల తీరును పోలీస్ బందోబస్తు ప్రక్రియను ప్రజెంటేషన్ ద్వారా ఎస్పీ గారు వివారించారు. అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి మొత్తం 922 పోలింగ్ కేంద్రాలకు, నిర్మల్ నియోజక వర్గానికి సంబంధించి 306 పోలింగ్ కేంద్రాలకు, ముదోల్ నియోజక వర్గానికి సంబంధించి 311 పోలింగ్ కేంద్రాలు, ఖానాపూర్ నియోజక వర్గానికి సంబంధించి 305 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందిని గురించి వివరిచినారు.

ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ… ఎన్నికల నిర్వహణలో పోలీస్, రెవెన్యు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో టీం వర్క్ తో సమిష్టిగా ఎన్నికల కమీషన్ నియమావళి ప్రకారం నడుచుకోవాలని, శాంతియుత వాతవరణంలో స్వేచ్ఛాగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా గట్టి చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై నిఘా ఉంచాలని ఆన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను వెంటనే గుర్తించాలని, పోలింగ్ శాతం పెరిగే విధంగా ఓటరు నిర్భయంగా వచ్చి తన ఓటు తనకు నచ్చిన వ్యక్తికీ వేసుకునే విధంగా కృషి చేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్క పోలింగ్ బూత్ దగ్గర ప్రతిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, పోలింగ్ బూత్ కు 100 మీటర్ల అవతలని వాహనాలను ఆపే విధంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఎస్బి ఇస్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.