Headlines

భద్రాద్రి రామయ్య తెప్పోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు

బూర్గంపాడు డిసెంబర్ 22 న్యూస్9

 

భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఆధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గోదావరి నది తీరంలో జరగనున్న స్వామి వారి తెప్పోత్సవానికి పగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు, భద్రాద్రి కలెక్టర్ ప్రియాంకఅలతెలిపారు. గురువారం ఆమె భద్రాచలం పట్టణానికి విచ్చేసి రామయ్య జలవిహారానికి జరుగుతున్న ఏర్పాట్లను ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు. తొలత శనివారం జరగనున్న ఉత్తర ద్వారదర్శన ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం గోదావరి హంసవాహనం ట్రైల్ రన్ ను పరిశీలించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలక్కుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేయాలన్నారు