Headlines

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. రక్షణ శాఖ మంత్రితో భేటీ..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌లో బిజీ బిజీగా ఉన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో ఈ మధ్యాహ్నం సమావేశమయ్యారు. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.

 

అలాగే రక్షణ శాఖ భూముల కేటాయింపుపై సీఎం రేవంత్ రాజ్‌నాథ్ సింగ్‌‌తో చర్చించారు. హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంపై సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దాదాపు 25 నిమిషాలు పాటు సీఎం రేవంత్ రెడ్డి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించారు.

 

ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు లోక్‌సభ ఎంపీలు మల్లు రవి, రాఘురామ్‌రెడ్డి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్, కుందూరు రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ కృష్ణ, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

 

ఆ తరువాత సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహన్ లాల్ ఖట్టర్‌ను కలిశారు. సీఎం రేవంత్‌తో పాటు మంత్రుల బృందం కూడా ఖట్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.