న్యూస్ 9 రిపోర్టర్
చేరాల. రవీందర్
9640 420 733
మంథని, పెద్దపల్లి
కరీంనగర్
పెద్దపల్లి జిల్లాలోని మంథని లో శుక్రవారం నాడు 64 వ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఐటి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీనుబాబు పాల్గొని యూత్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసారు. కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ పునాదిలాంటిదని, దేశంలో,రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందటానికి ప్రధాన కారణం యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి కారణమని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీనుబాబు అన్నారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రీనుబాబు యూత్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మే 30 వ తారీకున తెలంగాణ రాష్ట్ర ఐటి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్బంగా రక్తదానం చేసిన వారికీ ప్రశంస పత్రాలను మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు అందజేశారు. శ్రీనుబాబు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన ప్రతి ఒకరు క్రమశిక్షణ కల్గిన నాయకునిగా ఉంటారని శ్రీనుబాబు అన్నారు.
పార్టీ అభివృద్ధి కోసం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకవెల్లాలని సూచించారు. గత పది సంవత్సరాలు అధికారం లేనప్పుడు పార్టీ అభివృద్ధి కోసం యూత్ కాంగ్రెస్ నాయకులు చాలా కష్టపడ్డారని గుర్తు చేశారు. ప్రతి ఒక కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ నాయకులు ఆర్ల గ్యాని, రావుల నగేష్, జంజర్ల అమరేందర్, ఆర్ల దేవేందర్, ఇళ్ళుటం శివకృష్ణ, ఆర్ల కార్తీక్, ఆర్ల సాయి, ఆర్ల క్రాంతికుమార్ ఎరుకల సురేష్, బండ కిశోర్ రెడ్డి బర్ల శ్రీను,….
మంథని మున్సిపల్ చైర్మన్ పి. రమ సురేష్ రెడ్డి, మండల అధ్యక్షుడు ప్రసాద్, మాజి సర్పంచ్ శ్రీనివాస్, పోలు శివ, లింగయ్య యాదవ్, బూడిద శంకర్, అరెల్లి కిరణ్ గౌడ్ లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.