న్యూస్ 9 టీవీ
రిపోర్టర్
మంథని, పెద్దపల్లి, కరీంనగర్
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ అనుమతులు లేకుండా నిర్వహించబడుతున్న వైన్ షాప్ లు మరియు బార్ అండ్ రెస్టారెంట్ ల మీదా కఠిన చెర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేష్ శుక్రవారం రోజున మంథని మున్సిపల్
కమిషనర్ కు వివిధ సమస్యలపై మున్సిపల్ కార్యాలయం లో పిర్యాదు చేసారు. ఈ సందర్బంగా బూడిద గణేష్ మాట్లాడుతూ మంథని మున్సిపల్ పరిధిలో వైన్ షాప్ లు మరియు బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు మున్సిపాలిటీ నుండి ట్రేడ్ లైసెన్స్ పర్మిషన్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారని అన్నారు. పేద ప్రజల నుండి ఇంటి పన్ను, చెత్త పన్ను, నల్ల పన్ను లు ముక్కు పిండి వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు పేద ప్రజల రక్తాన్ని జలగలా లాగా పీల్చుకుంటూ కోట్లాది రూపాయలను జేబులు నింపుకుంటున్న లిక్కరు వ్యాపారుల నుండి ఫీజులు ఎందుకు వసూలు చెయ్యటం లేదని ప్రశ్నించారు.లైసెన్స్ ల రూపంలో మున్సిపల్ కి పన్నులు చెల్లించ కుండా అదయానికి గాండి కొడుతూ ప్రభుత్వాన్ని లిక్కరు వ్యాపారాలు మోసం చేస్తున్నారని విమర్శించారు.మున్సిపల్ అధికారులు అన్ని షాప్ లకు ట్రేడ్ లైసెన్స్ లు ఇచ్చి మున్సిపల్ కి ఆదాయం వచ్చేలా చెర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బూడిద గణేష్ కోరారు.బూడిద గణేష్ వెంట నాయకులు బాబు రవి ఉన్నారు.