Headlines

కే సీ గుప్తా జయంతి సందర్బంగా రక్త దాన శిబిరం..

న్యూస్ 9tv

రిపోర్టర్

మంథని, పెద్దపల్లి

కరీంనగర్

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో వాసవి క్లబ్, వనితా వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో ఆదివారం నాడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

 

వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు కే సీ గుప్తా జయంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని తలసేమియా వ్యాధి గ్రాస్థుల కొరకు ఏర్పాటు చేసినట్లు వాసవి క్లబ్ మంథని అధ్యక్షులు దొంతుల రామలింగేశ్వర్ తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో వనితా వాసవి క్లబ్ అధ్యక్షులు ఇల్లందుల మౌనిక, ప్రధాన కార్యదర్శి మరాల మౌనిక, కోశాధికారి గంప ఆదిత్య, జోన్ ఛైర్మన్ ఇల్లందుల కిషోర్ కుమార్, లయన్స్ క్లబ్ మంథని అధ్యక్షులు మేడగోని వెంకటేష్ గౌడ్, మేడగోని రాజమౌళి గౌడ్ లతో పాటుగా కొమురవెల్లి ఉదయ్ భాస్కర్, దొంతుల రాజేష్, దొంతుల ఓం ప్రకాష్, రాచర్ల రాజేందర్, చిటికేసి రాజన్న, ఇల్లందుల చిరంజీవి, కొమురవెల్లి శ్రీనివాస్, కుక్కడపు రాజ శివ ప్రసాద్, మెడికల్ సిబ్బంది, రాజేందర్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.