Headlines

రాష్ట్ర ప్రభుత్వం రవీంద్రభారతిలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు హాజరైన మంత్రి సీతక్క…

న్యూస్ 9 tv రిపోర్టర్

చేరాల రవీందర్

మంథని

కరీంనగర్

తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడు, పదవులను తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ..పుట్టడం మరణం కి మధ్య ఏ లక్ష్యం కోసం ఆశయం కోసం పని చేసారో అదే ముఖ్యం.

జనం కోసం పుట్టి జనం కోసం మరణిస్తే జన నాయకుడు అవుతారు. నిజాం కి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు, ప్రత్యేక రాష్ట్రం కోసం అన్నగారిన వర్గాల హక్కుల కోసం జీవితాన్ని ధారపోశారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ, పోలీసు కేసులు జైలు ,పదవులు త్యాగం చేసి తెలంగాణా కోసం పోరాడిన వ్యక్తి తెలంగాణ నిజమైన బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ, గాంధీజీ సిద్ధాంతాల మార్గం ను ఎంచుకొని పోరాడారు..ఎమ్మెల్యే, మంత్రి ,డిప్యూటీ స్పీకర్ గా ఎన్నో పదవులు చేశారు..అణగారిన వర్గాల గొంతుకఐ,బడుగు బలహీనవర్గాల కోసం పోరాడిన మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ..

వారి జయంతి అధికారికంగా నిర్వహించుకుంటున్నాం.

భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ప్రముఖుల జయంతి వేడుకలను నిర్వహించుకుందాం రాష్ట్ర మంత్రి సీతక్క ఈ సందర్బంగా తెలిపారు.