(సెప్టెంబర్ 28)
మంథనిమున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమ కు…..
మున్సిపల్ కమిషనర్ : మనోహర్ కు….
వినతి పత్రంలు అందజేసిన ప్రజాసంఘాల నాయకులు..
పెద్దపల్లి జిల్లా మంథని, పట్టణంలో గల శ్రీపాద కాలనీ మరియు పట్టణ శివారులో గల గౌడ్స్ మరియు పద్మశాలి సామాజిక వర్గాలకు కేటాయించిన ఫ్లాట్లలో ఎలాంటి పట్టాలు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన కబ్జా దారులమీద సమగ్ర విచారణ జరిపి అక్రమ నిర్మాణాలను కూల్చివేసి నిజమైన నిరుపేదలైన అర్హులైన వారికి స్థలాలు కేటాయించాలని కోరుతూ శనివారం రోజున (ఈరోజు) మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమ కు, మున్సిపల్ కమిషనర్ మనోహర్ కు ఇద్దరికి వేరు వేరు గా వినతి పత్రం లు ఇవ్వడం జరిగింది.
మున్సిపల్ చైర్మన్ తో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బాణయ్య, కౌన్సిలర్ వి కె రవి, పాపారావు ఉన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ డిపిటెడ్ ఎంపీ బూడిద తిరుపతి, సిపిఎం డివిజన్ కార్యదర్శి బూడిద గణేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బావు రవి తదితరులు పాల్గొన్నారు.