న్యూస్ 9 tv
మంథని, పెద్దపల్లి.
(సెప్టెంబర్ 29)
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం లోని పలు కుటుంబలను ఆదివారం రోజున మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట. మధుకర్ పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.మంథని మండలం కన్నాల గ్రామంలో మాజీ ఎంపిటిసి పోయిల శారద భర్త బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పోయిల బాపు మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మల్లెపల్లి గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆత్కూరి నరసయ్య మరణించగ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కాటారం మండలం గుమ్మళ్ళపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కంకణాల రాజిరెడ్డి ని, తడండ్ల పోచయ్య, కోలుగురి రాజయ్య లు ఇటీవల మరణించగ వారి కుటుంబాలను, గారేపల్లి గ్రామంలో తైనేని మల్లయ్య ఇటీవల మరణించగ వారి కుటుంబాన్ని,V6 రిపోర్టర్ రంజిత్ తండ్రి పెండ్యాల ఆనందం ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి, మద్దులపల్లి గ్రామంలో గడ్డం మల్లమ్మ ఇటీవల మరణించగ వారి కుటుంబాన్ని, కొత్తపల్లి గ్రామంలో పాగే మల్లయ్య ఇటీవల మరణించగ వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్. ఈ కార్యక్రమం లో బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.