న్యూస్ 9 tv రిపోర్టర్
మంథని, పెద్దపల్లి
(అక్టోబర్ 02)
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ లో గల మహత్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు ఆయిలి ప్రసాద్,మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమ,ప్రచార కమిటీ చైర్మన్ వోడ్నల శ్రీనివాస్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్,మాజీ ఎంపీపీ కొండ శంకర్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోలు శివ తదితరులు మాట్లాడుతూ
గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్లో జన్మించారు. బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో భారతదేశానికి వ్యాపారానికి వచ్చి ఈ దేశాన్ని అస్థగతం చేసుకొని బానిసలుగా చేసి వారిపై అగైత్యాలను దాడులు చేసేవారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వారు ఎన్నో స్వతంత్ర పోరాటాలు చేసారని కొనియాడారు.
దేశ స్వాతంత్రం కోసం ఉప్పు సత్యాగ్రహ దీక్షలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టి దేశ ప్రజలందరిని ఏకతాటికి తీసుకువచ్చి ఈ దేశం నుండి బ్రిటిష్ మూకల్ని తరిమి కొట్టడంలో ముఖ్యపాత్ర వహించిన వ్యక్తి మహాత్మా గాంధీ జీ అని అన్నారు. అహింస ద్వారా ప్రపంచం శాంతి కోసం గాంధీ మహాత్ముడు ఎంతగానో కృషి చేశారు. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం ఎంతగానో కలలుకన్నారు. ఆయన కలలను 73 ,74 సవరణల ద్వారా కాంగ్రెస్ పార్టీ గ్రామ స్వరాజ్యాన్ని సహకారం చేసింది.
మా ప్రియతమ నాయకులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, శ్రీను బాబు శాంతిని నెలకొల్పడానికి కృషి చేస్తా ఉన్నారు. గాంధీ గారి ఆశయ సాధనలో ముందుకు నడిపిస్తున్నారు.మంథని అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు.
గాంధీజీ నిరాడంబరుడు, వృత్తి విద్యలను ప్రోత్సహించాడు. సత్యం, అహింస,శాంతి ఉత్తమ మార్గాలని దృఢంగా నమ్మి ఆచరించిన మహనీయుడు గాంధీజీ జాతిపితగా, మహాత్ముడిగా శాశ్వతంగా భారతీయుల హృదయాల్లో నిలిచే ఉంటారని నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో మండల, మున్సిపల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.