Headlines

మంథనిలో ఆలాయ్ బలాయి కార్యక్రమం ను నిర్వహిస్తా.. విద్యార్థి సంఘం నాయకుడు : బెజ్జంగి డిగంబర్..

న్యూస్ 9 tv రిపోర్టర్

చేరాల. రవీందర్

మంథని, పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో రాజకీయ పార్టీలకతీతంగా ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావాలనేదే నా ఉద్దేశం.రాజకీయాలు కేవలం ఎలక్షన్ల వరకు మాత్రమే ఎలక్షన్ల తర్వాత మనమంతా ఒక్కటే అనేదే నా ముఖ్యమైన నినాదం. అలాయి బలాయి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు మేధావులు, కవులు, కళాకారులు, పాత్రికేయులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో త్వరలో ఈ కార్యక్రమాన్ని మంథని పట్టణంలో ఏర్పాటు చేస్తా.దీని ముఖ్య ఉద్దేశం రాజకీయంగా , ఎలాంటి వ్యక్తిగత కక్షలకు పోకుండా ఒక మంచి వాతావరణం లో అందరం కలిసి మెలిసి ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నించడమే ఈ కార్యక్రమం. అంతేకాకుండా మనందరం ఒకటే అనే వాతావరణం ఈ మంథని ప్రాంతంలో తీసుకురావాలన్నదే నా యొక్క అభిమతం అని తెలియజేశారు. త్వరలో అలాయి బలాయ్ కార్యక్రమం కొరకు ఐటి మంత్రి శ్రీధర్ బాబును, టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును, బిజెపి జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డిని, వీళ్ళతో పాటు మేధావులను , పాత్రికేయులను, వివిధ సంఘాల ప్రతినిధులను కలుస్తానని విద్యార్థి సంఘం నాయకులు బెజ్జంకి డిగంబర్ తెలిపారు.