నేరేడ్ మెట్ గౌడ సంఘం నాయకులు ఆదివారం మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నేరేడ్ మెట్ గౌడ సంఘం స్మశాన వాటిక అభివృద్ధి కొరకు సహకరించాలని కోరారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సన్మానం చేశారు. కార్యక్రమంలో బి.ఈశ్వర్ గౌడ్, టి.పవన్ కుమార్ గౌడ్, జే.అభిషేక్ గౌడ్, జి.జహంగీర్ గౌడ్, ఎం.శ్రీకాంత్ గౌడ్, ఏ.మధుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.