జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శనీయం : రొక్కాల నాగ బుజ్జి..

పశ్చిమగోదావరి జిల్లా,

తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 11:

 

సామాన్యుడిగా మొదలై , సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ ప్రభుత్వ విజిలెన్స్ , మోనిటరింగ్ కమిటీ సభ్యులు రొక్కాల నాగ బుజ్జి అన్నారు. గురువారం తాడేపల్లిగూడెంలో ఆదర్శ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి రొక్కాల ఆశీర్వాదం అధ్యక్షతన కార్యాలయం వద్ద జ్యోతిరావు పూలే 198వ జయంతి విద్యార్థులు నిర్వహించారు. రొక్కాల నాగ బుజ్జి మాట్లాడుతూ సమాజంలో వివక్షకు , తావు లేదని సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. పూలే త్యాగాలను సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కిరణ్మయి , విద్యార్థులు , ఆదర్శ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.