సామాన్య భక్తులకు స్వామివారి సేవలు అందుబాటులోకి

చిత్తూరు జిల్లా

సామాన్య భక్తులకు స్వామివారి సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆలయ పాలకమండలి అధికారులు కృషి చేస్తున్నారని కాణిపాకం పాలకమండలి చైర్మన్ అగరం మోహన్ రెడ్డి అన్నారు.

శుక్రవారం కాణిపాకం ఆలయ పాలకమండలి సమావేశం చైర్మన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ ఈవో వెంకటేష్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆలయంలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ అభివృద్ధిలో భాగంగా సుమారు 80 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను చేపట్టి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు డార్మెంటరీ, అన్నదాన విస్తరణానికి సంబంధించి అదనపు భవనం, నూతనంగా బస్టాండు ఏర్పాటు తోపాటు భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు ఉద్యానవనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఈవో వెంకటేష్ మాట్లాడుతూ ఆలయం లో ఉన్న బంగారు వెండి ఇతర డిపాజిట్లు ప్రజలకు పారదర్శకంగా ఉండేందుకు లెక్కలు తయారు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో 144 కోట్ల 87 లక్షల 5 వేల 700 రూపాయలు, బంగారం 17 కేజీల 680 గ్రాములు, వెండి 1000 21 కేజీ 708 గ్రాములు, సేవింగ్ అకౌంట్లో 18 కోట్ల 68 లక్షల 39 వేలు రూపాయలు, గో సంరక్షణ నిధికి 21 లక్షల 3 వేల 601 రూపాయిలు, నిత్య అన్నదాన ట్రస్టు ఎస్ బి ఐ లో రెండు కోట్ల 93 లక్షల 42 వేల 278 రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ఉండేందుకు ఆలయానికి సంబంధించిన నిధులను వెల్లడించను జరిగిందని ఈవో వెంకటేశు, చైర్మన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎక్స్ అభిషియో సభ్యులు సోమశేఖర్ గురుకుల్ పాటు ఏఈవోలు రవీంద్రబాబు, విద్యాసాగర్ రెడ్డి, హేమామాలిని, హరి మాధవరెడ్డి, సూపర్డెంట్ కోదండపాణి తదితరులు పాల్గొన్నారు.