
పెనమలూరులో పోటెత్తిన జనం.. తెల్లవారుజామున వరకు సాగిన లోకేష్ పాదయాత్ర
ఉమ్మడి కృష్ణాజిల్లా నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. నిన్న విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ప్రారంభమైన పాదయాత్ర పెనమలూరు నియోజకవర్గంలోకి చేరుకుంది. పెనమలూరు నియోజకవర్గంలో నారా లోకేష్‌కు ఇంఛార్జ్ బోడే ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా లోకేష్‌కి మహిళలు అపూర్వస్వాగతం పలికారు. అర్థరాత్రి దాటిన ప్రజలు లోకేష్ ను కలిసేందుకు రోడ్లపైనే వేచి ఉన్నారు. మహిళలు చిన్నారులు లోకేష్‌ని కలిసేందుకు పోటీపడ్డారు. పెద్దసంఖ్యలో మహిళలు నారా లోకేష్‌ని కలిసి సంఘీభావం తెలిపారు….