Headlines

బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ జె.పి నడ్డా గారితో వై.సత్యకుమార్ .

ఆంధ్రప్రదేశ్ బిజెపి నూతన రథ సారధిగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ పేరును కేంద్ర నాయకత్వం ఖరారు చేసినట్లుగా సమాచారం.గత రాత్రి డిల్లీలో సమావేశమైన కేంద్ర పెద్దలు 3అంశాలపై ప్రధానంగా చర్చించారు.పార్టీ బలహీనంగా ఉన్నచోట రాష్ట్ర అధ్యక్షులను మార్చాలని నర్ణయించారు.అలాగే ఏ.పి.కి సంభందించి సోము వీర్రాజు ను తొలగించి ఆ స్థానంలో సత్యకుమార్ కుఅవకాశం ఇవ్వడం ద్వారా రాబోవు ఎన్నికలకు బిజెపి ని బలోపేతం చేయగలరని అధిష్టానం భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.సత్యకమార్ అండమాన్&నికోబార్ ఇన్ చార్జిగాను ఉత్తరప్రదేశ్ కో ఇన్ చార్జిగా భాధ్యతలు నిర్వహిస్తూనే ఆంధ్రప్రదేశ్ లో నిత్యం పర్యటిస్తూ ప్రభుత్వఅవినీతిని ఎండగడుతున్నారు.పలు సందర్భాలలో సియం ను మంత్రులను నిలదీస్తున్నారు.ప్రజా సమస్యలపై ఏకరువు పెడుతున్నారు.సత్యకుమార్ ను నిలువరించడానికి వైసిపి మూకలు మందడంలో ఆయన వాహనం పై దాడి కూడా చేశారు.ఏమాత్రం వెనకడుగు వేయకుండాసత్యకుమార్ నిత్యం ప్రజల పక్షాన పోరాడుతున్నారు.రాబోవు ఎన్నికలను ఎదుర్కోడానికి బిజెపి సమర్థవంతమైన నాయకులను పలు రాష్ట్రాలకు బాధ్యులుగా నియమిస్తోంది.ఈ నేపద్యంలో ఏ.పి కి సత్యకుమార్ ను అధ్యక్షుడుగా నియమించడం వలన పార్టీ క్యాడర్ లో జోష్ వస్తుందని 2024లో పార్టీ విజయం కూడా సులభమౌతుందని అధిష్టానం భావిస్తోంది.ఇప్పటి వరకు పనిచేసిన సోము వీర్రాజు స్తానంలో సత్యకుమార్ అధ్యక్షుడుగా రాబోతున్నారు.అతి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.