పెనమలూరులో పోటెత్తిన జనం.. తెల్లవారుజామున వరకు సాగిన లోకేష్ పాదయాత్ర

ఉమ్మడి కృష్ణాజిల్లా నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. నిన్న విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ప్రారంభమైన పాదయాత్ర పెనమలూరు నియోజకవర్గంలోకి చేరుకుంది.

పెనమలూరు నియోజకవర్గంలో నారా లోకేష్‌కు ఇంఛార్జ్ బోడే ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా లోకేష్‌కి మహిళలు అపూర్వస్వాగతం పలికారు. అర్థరాత్రి దాటిన ప్రజలు లోకేష్ ను కలిసేందుకు రోడ్లపైనే వేచి ఉన్నారు. మహిళలు చిన్నారులు లోకేష్‌ని కలిసేందుకు పోటీపడ్డారు. పెద్దసంఖ్యలో మహిళలు నారా లోకేష్‌ని కలిసి సంఘీభావం తెలిపారు. షెడ్యూల్ లో ఉన్న సమయం కంటే 4గంటల ఆలస్యంగా పాదయాత్ర కొనసాగింది. అందరినీ ఆప్యాయంగా పలకలరిస్తూ నారాల లోకేష్ ముందుకుసాగారు. యువనేత లోకేష్ ను చూసేందుకు బ్రిడ్జిలు, భవనాలపైకి ఎక్కారు.

పాదయాత్రలో నారా లోకేష్ ను కలిసిన కంకిపాడు మండల ప్రజలు కలిశారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకి సెంటర్ లో కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు, వణుకూరు, మద్దూరు, కాసరనేనిపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ మండలంలో టీడీపీ పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక రోడ్లపై గుంతల్లో తట్ట మట్టి పోసిన దాఖలాలు లేవని లోకేష్‌కి ప్రజలు తెలిపారు. ఉప్పులూరు నుండి ఈడుపుగల్లు మీదుగా మద్దూరు వరకు ఆర్.అండ్.బి రహదారి నిర్మాణానికి టీడీపీ హయాంలో అంచనాలు తయారుచేసి, టెండర్లు కూడా పిలిచారని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రతిపాదనలు ఎక్కడివక్కడే నిలచిపోయాయన్నారు.

బందరు రోడ్డు నుండి ఏలూరు రోడ్డులోకి వెళ్లే రోడ్డు మొత్తం గతుకులమయమై ఇబ్బందులు పడుతున్నామని. టీడీపీ అధికారంలోకి వచ్చాక నిలిచిపోయిన రోడ్డు పనులు పూర్తిచేయాలని గ్రామస్తులు లోకేష్‌ని కోరారు. జగన్మోహన్ రెడ్డికి పన్నుల బాదుడుపై ఉన్న శ్రద్ధ మౌలిక సదుపాయాల కల్పనపై లేదన్నారు నారా లోకేష్‌.. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెనమలూరు నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా రోడ్లపై తట్టడు మట్టి పోసిన దాఖలాలు లేవని.. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లకు 1.30లక్షల కోట్లరూపాయల బిల్లులు పెండింగ్ లో పెట్టారన్నారు. దివాలాకోరు ప్రభుత్వాన్ని చూసి ఏ కాంట్రాక్టర్ పనులు చేయడానికి ముందుకు రావడంలేదని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప్పులూరునుంచి ఈడ్పుగల్లుమీదుగా మద్దూరు ఆర్ అండ్ బి రహదారి నిర్మాణాన్ని చేపడతామని లోకేష్ గ్రామస్తులకు హమీ ఇచ్చారు.