Headlines

అట్టుడికిపోతున్న ఫ్రాన్స్.. మేయర్ ఇంటికి నిప్పు

ఫ్రాన్స్ అట్టుడికిపోతుంది. 17 యేళ్ల యువకుడిని ఓ పోలీసు కాల్చి చంపిన ఘటనతో ఫ్రాన్స్‌లో అల్లర్లు మొదల్యయాయి. ఇవి గత ఐదు రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
పలు చోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఆందోళనకారులు తాజాగా మరింతగా రెచ్చిపోయారు. ఫలితంగా పారీస్ శివారు ప్రాంతంలో ఉన్న మేయర్ ఇంటికి నిప్పు పెట్టారు. ఆయన ఇంటిలోకి ఓ కారు దూసుకెళ్లింద. ఈ ఘటనలో మేయర్‌తోపాటు ఆయన భార్య, కుమారుడు గాయాలపాలయ్యారు. దీనిపై స్పందించిన మేయర్‌.. ఆందోళనకారులది చెప్పలేనంత పిరికిపంద చర్య అని వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఐదోరోజు కూడా ఫ్రాన్స్‌ ఆందోళనలతో అట్టుడుకుతోంది. పారీస్‌, మార్సెయిల్‌, లియాన్‌ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు. వీరిని అదుపుచేసేందుకు 45 వేల మంది పోలీసులతోపాటు ఇతర సాయుధ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు.

అయినప్పటికీ రెచ్చపోయిన ఆందోళన కారులు 10 షాపింగ్‌ మాళ్లు, 200లకు పైగా సూపర్‌ మార్కెట్లు, 250 బ్యాంకు సేవా కేంద్రాలతోపాటు ఇతర దుకాణాలపై దాడులు చేసి లూటీ చేశారు. ఈ క్రమంలో ఇప్పటివరకు వరకు సుమారు 2వేల మందిని ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. కేవలం ఆదివారం ఉదయం ఒక్కరోజే 719 మందిని నిరసనకారులను అరెస్టు చేశారు.