
బీజేపీ మ్యానిఫెస్టోలో కర్నాటక విఫల హామీలు ? టార్గెట్ అదేనా !
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను బీజేపీ ఇవాళ విడుదల చేసింది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోలను విడుదల చేసేశాయి. దీంతో ఎన్నికలకు సరిగ్గా 12 రోజుల ముందు బీజేపీ తమ మ్యానిఫెస్టో ప్రకటించింది. అయితే ఇందులో కొన్ని వివాదాస్పద అంశాలను కూడా చేర్చింది. ఈ ఏడాది కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైన హామీల్ని తిరిగి తెలంగాణలో ఇవ్వడంతో వాటిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ మధ్య బీజేపీ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ…