Headlines

మండల సమావేశానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోండి.– కొత్త పేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి

మండల సమావేశానికి హాజరుకాని అధికారులు పై తక్షణ చర్యలు తీసుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఎంపీడీవో జాన్ లింకన్ ను ఆదేశించారు. ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చిర్ల మాట్లాడుతూ అధికారులతో పని చేయించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, ప్రజాప్రతినిధులు అందరూ మండల సమావేశానికి హాజరైనప్పుడు అధికారులు ఎందుకు హాజరవ్వరని అన్నారు. మండల సమావేశానికి ప్రజాప్రతినిధులతో పాటు పంచాయతీ కార్యదర్శులు అందరూ హాజరవ్వగా, కొన్ని శాఖలు అధికారులు మాత్రమే హాజరయ్యారు. మరో కొన్ని శాఖల కింద స్థాయి సిబ్బంది హాజరయ్యారు. మండల సమావేశాలు ఇలా నిర్వహిస్తే ప్రజా ప్రతినిధులు అడిగిన సమస్యలపై పరిష్కారం ఎలా అమలవుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు పట్టారు పొందిన లబ్ధిదారులందరికీ భూమిని అప్పగించే చర్యలు చేపట్టామని, త్వరలోనే లే అవుట్ ఫిల్లింగ్ జరుగుతుందని హామీ ఇచ్చారు. అలాగే కాలవలో పూడికతీతలను వెంటనే తొలగించి ప్రతి శివారు పంట భూమికి పూర్తిస్థాయిలో నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ ఏఈని ఆదేశించారు. విద్య, వైద్య ఆరోగ్య, త్రాగునీరు, ఐసిడిఎస్, వ్యవసాయ వంటి పలు శాఖలపై సమీక్షించారు.