రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో నిరుద్యోగ యువత,లాయర్లు,డాక్టర్లు మరియు ఉపాధ్యాయులతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు జూమ్ యాప్ ద్వారా జరిగిన సమావేశంలో పాల్గొన్నాను.దేశానికి వెన్నెముక లాంటి యువత,న్యాయాన్ని కాపాడే న్యాయవాదులు,ప్రాణం పోసే డాక్టర్లు,విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే ఉపాధ్యాయులు ప్రస్తుత రాష్ట్రంలోని పరిస్థితుల దృశ్యా రాష్ట్రాన్ని కాపాడటానికి తమవంతు సహకారం అందించాలని కోరాను.జగన్ ప్రభుత్వం పంచాయతీలు,స్థానిక సంస్థలను పూర్తిగా దివాలా తీయించి కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితికి తీసుకొచ్చారని తెలిపాను.నారా చంద్రబాబునాయుడు గారు ఇచ్చిన సలహాలను,సూచనలను పాటించి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్ది,సమస్యలతో సతమతమవుతున్న ప్రజలను కాపాడే యాగంలో పాలుపంచుకోవాలని కోరాను. సమాజంలో డాక్టర్లు, లాయర్లు, టీచర్ల బాధ్యత ఎంతో ముఖ్యమైనదని అలాంటి వారిని కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం భయబ్రాంతులకు చేస్తుందని, మీరు ఎవరూ భయపడవద్దని మీ తరపున పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వెన్నుదన్నుగా వుంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. యువతకు ఉపాధి కల్పించడంలో అధికార ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, ఎటుచూసినా గంజాయి మత్తులో యువత జోగుతుందని, ఈపరిస్థితి రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదని, క్రైమ్ రేటు పెరిగి పోతుందని తద్వారా యువత భవిష్యత్తు నాశనమవుతుందని బండారు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.