Headlines

కిడ్నీ,లివర్ వ్యాధి బాధితుని కుటుంబానికి ఆర్దిక సాయన్ని అందించిన బండారు సత్యానందరావు…

కిడ్నీ,లివర్ వ్యాధితో రాజమండ్రి బొల్లినేని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కామిశెట్టి ఆది సత్యనారాయణ కుటుంబానికి కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆర్దిక సాయాన్ని అందించారు.వివరాల్లోకి వెళ్తే కొత్తపేట నియోజకవర్గం బిళ్ళకూరు గ్రామానికి చెందిన కామిశెట్టి వెంకట సీతారామరాజు,సత్య నాగలక్ష్మి దంపతుల పెద్దకుమారుడు ఆది సత్యనారాయణ కిడ్నీ,లివర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న యెలిశెట్టి రామకృష్ణ,యెలిశెట్టి నరసింహారావు,వాకాడ చిన్నా మరియు గ్రామస్తులు సేకరించిన సొమ్మును సత్యానందరావు చేతుల మీదుగా గ్రామంలో వున్న బాధితుని కుటుంబ సభ్యులకు 40 వేల రూపాయల ఆర్దిక సాయాన్ని అందించారు.సత్యనారాయణ త్వరగా కోలుకుంటాడని బాధితుని కుటుంబానికి ధైర్యం చెప్పారు.