- దివ్యాంగులకు అండగా సత్య సౌదా పౌండేషన్
కనిపించేనా కరుణించేనా అంటూ ఈనెల ఏడవ తారీఖున ప్రముఖ దినపత్రిక ఈనాడులో ప్రచురించిన కథనానికి స్పందించిన సత్య సౌధ ఫౌండేషన్…
ద్రాక్షారామకు చెందిన శ్రీను, పద్మావతిలకు పుట్టిన బిడ్డలు అయిన వందన, ఆనంద కుమార్ లు పుట్టుకతోనే దివ్యాంగులు కావడంతో వారి కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉండడంతో వారి తల్లిదండ్రులు ఎక్కడికైన వెళ్లి జీవనోపాధి చేసుకునే అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు.ఈ నేథ్యంలో సత్య సౌధ ఫౌండేషన్ తరపున వారికి నెలకు సరిపడా కుటుంబ పోషణ కొరకు 21రకాల బియ్యం, కంది పప్పు,మంచి నూనె, గోధుమ పిండి వంటి నిత్యావసర సరుకులను సంవత్సరం పాటు అందించడం జరుగుతుంది అని సంస్థ వైస్ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణ తెలిపారు.ఈ కార్య క్రమంలో సంస్థ జనరల్ సెక్రటరీ చెల్లుబోయిన సుగుణ, మీడియా వ్యవహారాల డైరెక్టర్ గుత్తుల శ్రీనివాస్,పి.ఆర్.ఓ పట్నాల శ్రీనివాస్,టీమ్ సభ్యులు టి.వీర పావని, అనుసూరి భవాని తది తరులు పాల్గొన్నారు.